Share News

బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 06:54 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అమరావతి, అక్టోబర్ 31: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపటి (ఆదివారం) నుంచి దీని ప్రభావం ఏపీపై చూపే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలోని పలు జిల్లాల్లో..

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వివరించింది. భద్రాద్రి, మెదక్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

రిలయన్స్‌ రికార్డు లాభం

For More Weather News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 08:05 AM