Share News

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:44 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం ముచ్చింతల్ వద్ద ఇన్నోవా క్రిస్టా, మరో వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

 కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..
Shekar Master Accident News

హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) కారుకు ఈరోజు (గురువారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం ముచ్చింతల్ వద్ద ఇన్నోవా క్రిస్టా, మరో వాహనం ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ మాస్టర్‌ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరగడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.


మహేశ్వరం మండలం గోల్లూరులో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌ను ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ పేరుతో మైనారిటీలు, దళితులు, పేదల ఓట్లను మోదీ సర్కార్ తొలగిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌కు వంచన

ప్రొబేషనరీ డీఎస్పీల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:00 PM