Share News

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:02 PM

ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపుల నుంచి రక్షణ కల్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి వినతిపత్రం అందజేశారు.

ఏఐ దుర్వినియోగానికి చెక్ పెట్టండి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి చిరంజీవి వినతి
Megastar Chiranjeevi

హైదరాబాద్, నవంబర్ 16: ఏఐ దుర్వనియోగం, డీప్‌ఫేక్‌‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సలహా మేరకు కిషన్‌రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన ఫొటోలను సోషల్ మీడియాలో మెగాస్టార్ పంచుకున్నారు.


ఈనెల 2 హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తనయుడు రామ్ చరణ్‌తో కలిసి చిరంజీవి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో డీప్‌ఫేక్ ముప్పుపై అమిత్‌ షాతో చర్చించినట్లు చిరంజీవి వెల్లడించారు. ఆయన సూచన మేరకే కేంద్ర హోంశాఖ, సమాచార, ప్రసార శాఖలను ఉద్దేశించి రూపొందించిన వినతిపత్రాన్ని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి అందజేసినట్లు తెలిపారు.


ఈ అంశాలపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చిన కిషన్‌రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు, కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను పరిరక్షించడం ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలే తప్ప.. వ్యక్తుల గౌరవానికి భంగం చేయకూడదని తన ఎక్స్‌ పోస్టులో చిరంజీవి అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి...

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..

ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 12:26 PM