Share News

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..

ABN , Publish Date - Nov 16 , 2026 | 09:45 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 17న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది.

ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..
CM Chandrababu Naidu

అమరావతి, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 17న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.


ఈనెల 17న ఉదయం 9:15 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. తన నివాసం వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9:25 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం 11:40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటల కల్లా ఢిల్లీలోని 1 జన్‌పథ్‌కు చేరుకుంటారు.


ఢిల్లీ పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 6:50 గంటలకు 1 జన్‌పథ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7:30 గంటలకు విమానంలో బయలుదేరి, రాత్రి 9:30 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. కాగా, ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

రామోజీ రావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి..

బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..

Updated Date - Nov 16 , 2026 | 09:50 AM