Share News

రామోజీ రావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి..

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:42 AM

రామోజీ రావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు ఓ కొత్త ఒరవడికి నాంది పలికారని సీఎం కొనియాడారు.

రామోజీ రావు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఘన నివాళి..
Ramoji Rao Birth Anniversary

అమరావతి, నవంబర్ 16: రామోజీ రావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు ఓ కొత్త ఒరవడికి నాంది పలికారని సీఎం కొనియాడారు. పత్రికా రంగంతో పాటు టీవీ, సినీ రంగాలలోనూ ఆయన తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. రామోజీ రావుని అపజయం అన్నది ఎరుగని తెలుగు వెలుగుగా అభివర్ణించారు. రాజీ పడని మనస్తత్వంతో ముందుకు సాగారని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్ట్..

'తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికి.. టీవీ, సినీ రంగాలలోనూ తనదైన ముద్రవేసి.. అపజయం అన్నది ఎరుగని తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. రాజీ అన్నది ఎరుగని వ్యక్తిత్వంతో, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలతో వ్యవస్థలకు ధైర్యాన్ని ఇచ్చి మీడియా సంస్థల ద్వారా సమాజంపై అత్యంత ప్రభావం చూపిన దార్శనికుడు రామోజీ రావు గారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం' అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీకి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్‌ రాజీనామా

కోట్ల రూపాయిల ప్రజాధనానికి గండి

Updated Date - Nov 16 , 2026 | 08:43 AM