బీజేపీకి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ రాజీనామా
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:50 AM
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీశ్ ప్రభాకర్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
బాపట్ల చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఆగ్రహం
బాపట్ల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అన్నం సతీశ్ ప్రభాకర్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పొత్తులో భాగంగా బాపట్ల మున్సిపాలిటీని బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ఇస్కా సునీల్‌ను ప్రకటించడాన్ని సతీశ్ వ్యతిరేకించారు. ఏకపక్షంగా స్థానికేతరుడిని ప్రతిపాదించారంటూ రాజీనామా చేశారు.
రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు పంపారు. ఏడేళ్లుగా నిబద్ధత గల కార్యకర్తగా కొనసాగుతున్నానని, ఏ సందర్భంలోనూ పార్టీ నుంచి పదవి కోరలేదని తెలిపారు. స్థానికులకు చైర్మన్ సీటు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పార్టీ నాయకత్వం చర్య స్థానిక నాయకులను అవమానించడం, బాపట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!