ఉద్యోగం కోసం మలేసియా వెళ్లి జైలుపాలైన కామారెడ్డి యువకుడు
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:55 AM
ఉద్యోగం కోసం మలేసియా వెళ్లిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి కటకటాలపాలైన తన భర్తను విడిపించి స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని బాధితుడి భార్య వేడుకుంటోంది.
కామారెడ్డి, నవంబర్ 16: ఉద్యోగం కోసం మలేసియా వెళ్లిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి కటకటాలపాలైన తన భర్తను విడిపించి స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని బాధితుడి భార్య వేడుకుంటోంది. కామారెడ్డికి చెందిన సురేష్ ఉద్యోగం నిమిత్తం మలేసియా వెళ్లాడు. మలేసియాలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ సురేష్‌ను నమ్మించిన ఏజెంట్.. కంపెనీ వీసా పేరు చెప్పి టూరిస్ట్ వీసాపై అక్కడకు పంపించాడు. ఇందు కోసం బాధితుడి నుంచి దాదాపు రూ.1.40 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్కడకు వెళ్లిన తర్వాత ఏజెంట్ చేసిన మోసాన్ని సురేష్ గుర్తించాడు. కంపెనీ వీసా కాకుండా టూరిస్ట్ వీసాపై వెళ్లిన బాధితుడు అక్కడి పోలీసులకు చిక్కాడు. వీసా గడువు ముగిసినప్పటికీ మలేసియాలోనే ఉండటంతో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గత నాలుగు నెలలుగా యువకుడు మలేసియాలో జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ విషయాన్ని బాధితుడు తన కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
దీంతో జైలు నుంచి అతడిని విడిపించాల్సిందిగా సదరు ఏజెంట్‌ను కుటుంబసభ్యులు కలిశారు. జైలు నుంచి విడిపించేందుకు మరో రూ.1.70 లక్షలు కావాలని ఏజెంట్ చెప్పడంతో బాధితుడి భార్య తన బంగారు నగలను తాకట్టుపెట్టి మరీ డబ్బులు చెల్లించింది. అయినా భర్త విడుదల కాకపోవడంతో తాడ్వాయి పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. ఎలాగైనా తన భర్తను మలేసియా జైలు నుంచి విడిపించి స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని మౌనిక ప్రాధేయపడుతోంది.
ఇవి కూడా చదవండి...
తవ్వేకొద్దీ బయటపడుతున్న జగన్ బంటు అక్రమాస్తులు ..!
ఈనెల 17న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అధికారిక షెడ్యూల్ ఖరారు..
Read Latest Telangana News And Telugu News