రాష్ట్రపతి భవన్‌లో బేగంపేట బడి పిల్లల సందడి
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:48 AM
ప్రభుత్వ గ్రామీణ పాఠశాల విద్యార్థులకు దేశ ప్రథమ పౌరురాలిని కలుసుకునే అరుదైన అవకాశం లభించింది.
ప్రథమ పౌరురాలితో ఫొటోలు దిగిన బాల బాలికలు
తెలంగాణ నుంచి ఒకే పాఠశాలకు అవకాశం
రాయపోల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ గ్రామీణ పాఠశాల విద్యార్థులకు దేశ ప్రథమ పౌరురాలిని కలుసుకునే అరుదైన అవకాశం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన బాలల దినోత్సవాల్లో... సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన బాలల దినోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాలబాలికలతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా బేగంపేట పాఠశాల విద్యార్థులు పంజాల కార్తిక, మంద హర్షవర్దన్, యంగారి చిట్టి, బర్కం అర్చన, బర్కం కరుణాకర్, మానస, సాన్వి, మణికంఠ రాష్ట్రపతితో ఫొటోలు దిగారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ముర్మును కలుసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రాష్ట్రపతితో ఫొటో దిగే అవకాశం బేగంపేట పాఠశాల విద్యార్థులకు మాత్రమే దక్కింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఈ పర్యటన జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మిగిలింది. జాతీయ స్థాయి వేదికపై బేగంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనడం పాఠశాలతోపాటు గ్రామానికి, జిల్లాకు గుర్తింపు తెచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వార్తలు
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News