తెలంగాణకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:29 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారిందని, ఈ నెల 17 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావం కారణంగా ఏపీతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెల 20-22 తేదీల్లో కురిసే అవకాశం
ఏపీలోని కోస్తాకు మరో తీవ్ర తుఫాన్ ముప్పు
హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం బలపడి, వాయుగుండంగా మారిందని, ఈ నెల 17 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావం కారణంగా ఏపీతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 20-22 తేదీల మధ్య రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ తుఫాన్‌గా, మంగళవారానికి పశ్చిమ మధ్యబంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో తీవ్రతుఫాన్‌గా మారుతుంది. తర్వాత ఏపీలోని కోస్తాంధ్ర తీరం దిశగా వస్తుందని ఐఎండీ తెలిపింది. 20న ఉదయం కళింగపట్నం, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఈనెల 18 నుంచి 20 వరకు కోస్తాలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా, వాయుగుండం గంటకు 15 కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాన్ ఇండియా సినిమా ఒక స్కామ్
తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రను ఒప్పించండి.. ప్రధానికి రేవంత్ వినతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News