Share News

ఒళ్లంతా వణుకుడే...!

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:22 AM

రాష్ట్రంలో చలి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. శీతల గాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా విధులు ముగించుకొని సాయంత్రం ఇళ్లకు చేరిన వారు చలి తీవ్రత వల్ల తిరిగి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు.

ఒళ్లంతా వణుకుడే...!
Telangana Cold Wave

  • రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

  • పెరిగిపోతున్న చలి తీవ్రత

  • సిర్పూర్‌(యూ)లో 11.4, హైదరాబాద్‌లో 13.4 డిగ్రీల కనిష్ఠం

  • క్యూర్‌ పరిధిలో మరో పది రోజులు చలి తీవ్రం : వాతావరణ శాఖ

హైదరాబాద్‌ సిటీ, ఆసిఫాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. శీతల గాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా విధులు ముగించుకొని సాయంత్రం ఇళ్లకు చేరిన వారు చలి తీవ్రత వల్ల తిరిగి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు. తెల్లవారుజామున చలితోపాటు పొగ మంచు తీవ్రత కూడా అధికంగా ఉంటోంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలంలో ఆదివారం 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని తిర్యాణిలో 12, కెరమెరిలో 13.3, వాంకిడిలో 13.7, జైనూరు, కాగజ్‌నగర్‌, రెబ్బెన మండలాల్లో 14.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ప్రజలు కూడా చలికి బెంబేలెత్తిపోతున్నారు.


క్యూర్‌ పరిధిలోని 12కు పైగా ప్రాంతాల్లో ఆదివారం 13 నుంచి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాప్రా, చార్మినార్‌ ప్రాంతాల్లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. పటాన్‌ చెరులో 13.8, అమీర్‌పేట 14.1, శేరిలింగంపల్లిలో 14.1 డి గ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్యూర్‌ పరిధిలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో పది రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. మరోపక్క, చలిగాలులు, పొగ మంచు దూర ప్రయాణాలపై ప్రభావం చూపెడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్టాండ్లతోపాటు ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో ఉదయం 5గంటల సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. చలి వల్ల ఇటీవల ప్రయాణికులు ఆలస్యంగా బస్టాండ్‌లకు వస్తున్నారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెహ్రూ శాస్త్రీయ దృక్పథమే నవ భారత నిర్మాణానికి పునాది

పాన్‌ ఇండియా సినిమా ఒక స్కామ్‌

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్రను ఒప్పించండి.. ప్రధానికి రేవంత్ వినతి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 01:22 AM