పాన్ ఇండియా సినిమా ఒక స్కామ్
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:42 AM
సినిమా ఒక కళారూపంగా కాకుండా లాభాలు ఆర్జించే వ్యాపారంగా మారిపోయిందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమా కాన్సె్‌ప్టను ఒక పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు.
అది సినిమాను చంపేస్తుంది...
భారీ బడ్జెట్ సినిమాలతో చిన్నసినిమాల మనుగడ కష్టం
మలయాళ చిత్రపరిశ్రమ మంచి వైరస్
ఆ తత్వం మిగతా సినిమా పరిశ్రమలకు రావాలి: అనురాగ్ కశ్యప్
ఛాయా సాహిత్యోత్సవంలో పాల్గొన్న దర్శకుడు
హైదరాబాద్ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సినిమా ఒక కళారూపంగా కాకుండా లాభాలు ఆర్జించే వ్యాపారంగా మారిపోయిందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశారు. పాన్ ఇండియా సినిమా కాన్సె్‌ప్టను ఒక పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. అది పూర్తిగా సినిమా నిర్మాతలు, వ్యాపారవేత్తలు సృష్టించిన మోసమని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌లో ఒకేరకమైన రుచి, ఒకేరకమైన తయారీ పద్ధతి ఉన్నట్లే... ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు కూడా సృజనాత్మకతను కోల్పోయి మూస ధోరణితో రూపొందుతున్నాయని పేర్కొన్నారు. శనివారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన ఛాయా సాహిత్యోత్సవంలో అనురాగ్‌కశ్యప్ మాట్లాడారు. భారీ బడ్జెట్ సినిమాల వ్యవహారం చలనచిత్ర వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు.
పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాల వల్ల చిన్నసినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇక మలయాళ చిత్రపరిశ్రమను ఒక మంచి వైర్‌సగా అనురాగ్ కశ్యప్ అభివర్ణించారు. మలయాళంలో నటులు, దర్శకులు, నిర్మాతల మధ్య సహకార ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. అక్కడ కనిపించే కలిసికట్టుగా పనిచేసే తత్వం మిగతా ప్రాంతాల సినిమా పరిశ్రమలకు వ్యాపించాలని ఆకాంక్షించారు. మలయాళ సినీపరిశ్రమలో తానే గొప్ప హీరో అని ఎవరూ అనుకోరని, అక్కడెవరూ వందల కోట్ల రూపాయలు డిమాండ్ చేయరని పేర్కొన్నారు.
ప్రస్తుతం సినిమా రూపకర్తలలో ఒకరకమైన భయం నెలకొందని.. ఏది చూపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోననే ఆందోళనతో నిజాయతీగా కథలు చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి సతీశ్ చప్పరికె సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె.శ్రీనివాస్ ఛాయా సాహిత్యోత్సవం రెండో ఎడిషన్ ప్రారంభోపన్యాసం చేశారు. ‘కానరాని మంటల్లో బూడిదవుతున్న పుస్తకాలు’ అంశంపై వాసిరెడ్డి నవీన్ అధ్యక్షతన వీక్షణం వేణుగోపాల్, ఎస్.కాత్యాయిని మాట్లాడారు. ‘సమాజాన్ని కుదిపే సాహిత్యం అవసరమా?’ అంశంపై సమావేశంలో ప్రొ.మృణాళిని, రాజ్యసభ సభ్యురాలు సల్మా, నిఘత్ సహిబా ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News