Share News

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:41 AM

వికారాబాద్‌లోని మధు కాలనీలో యువ మహిళా క్రికెటర్‌ నందిని(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!
Nandini

  • అనుమానాస్పద మరణంగా కేసు నమోదు

వికారాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌లోని మధు కాలనీలో యువ మహిళా క్రికెటర్‌ నందిని(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం సాయంత్రం తన మేనమామ రమేశ్‌ ఇంట్లో ఉరి వేసుకుని కన్పించింది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు యువకుల ప్రేమ పేరుతో చేసిన వేధింపులే నందిని మరణానికి కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వారి ఒత్తిడి భరించలేకనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నందిని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా, నందిని మృతికి కారణమైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి కుటుంబీకులు వికారాబాద్‌లో ధర్నా చేశారు.


ఇవి కూాడా చదవండి..

విచిత్రం: ఓవర్ స్పీడ్‌కు చలానా.. లొకేషన్ మాత్రం అట్లాంటిక్ మహాసముద్రం!

అస్సాంలో ఘోర ప్రమాదం.. మినీబస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొని పలువురి మృతి

Updated Date - Nov 14 , 2026 | 06:41 AM