Share News

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం షాక్.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణం సంగతి తెలియదన్న అశ్వినీ వైష్ణవ్

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:20 PM

హైదరాబాద్ మెట్రో ఫేస్‌-2పై కేంద్రం మాటమార్చింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ఆర్థిక సహకారం తన పరిధిలోకి రాదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం షాక్.. ఐఆర్‌ఎఫ్‌సీ రుణం సంగతి తెలియదన్న అశ్వినీ వైష్ణవ్
Hyderabad Metro Phase 2

న్యూఢిల్లీ, నవంబర్ 23: హైదరాబాద్ మెట్రో ఫేస్‌-2పై కేంద్రం మాటమార్చింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ఆర్థిక సహకారం తన పరిధిలోకి రాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. మెట్రో రెండోదశకు ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ఇస్తానన్న రుణం సంగతి తనకు తెలియదని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేస్-2 రుణాల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. పలుసార్లు అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మెమోరాండంలు అందజేసిన విషయం తెలిసిందే.


హైదరాబాద్ మెట్రో రెండోదశకు అనుమతులు, నిధులు ఇవ్వాలంటూ అశ్వినీ వైష్ణవ్‌ను కిషన్ రెడ్డి కలిసి మరీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఐఆర్‌ఎఫ్‌సీ నిధుల వ్యవహారంలో ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్‌ తీసుకుని రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కిషన్ రెడ్డి కలిశారు. అయితే ఈరోజు (సోమవారం) మీడియాతో జరిగిన ఇష్టాగోష్టిలో... హైదరాబాద్‌ మెట్రో, ఐఆర్‌ఎఫ్‌సీ ఆర్థిక సహకారం విషయాలేవి తనకు తెలియదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.


వచ్చే ఏడాది మే లో బుల్లెట్ ట్రైన్ ట్రయల్ రన్ జరుగుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బులెట్ రైలు కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. బులెట్ ట్రైన్ 250 కి.మీ వేగంతో నడవనుందన్నారు. అహ్మదాబాద్, ముంబై మధ్య బులెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ఈ కారిడార్‌లో సూరత్, బిలిమొరా సెక్షన్‌లో 50 కిలోమీటర్ల మేర రైలు కారిడార్ పూరైనట్లు తెలిపారు. ఇదే వేగంతో అన్ని సెక్షన్‌లలో పనులు వేగంగా పూర్తి చేయనున్నామని చెప్పారు. 2029 నాటికి బులెట్ ట్రైన్ థానే వరకు చేరుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు: భట్టి విక్రమార్క

గ్లోబల్ సమ్మిట్‌కు ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎంట్రీ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 04:35 PM