రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్‌గా మేడిశెట్టి శేషారావు ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:08 PM
కోనసీమ జిల్లా రామచంద్రపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్మన్‌గా మేడిశెట్టి శేషారావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వైస్ ఛైర్మన్‌గా కవల నారాయణ మూర్తి ప్రమాణం చేశారు.
కోనసీమ, నవంబర్ 23: రామచంద్రపురం పురపాలక సంఘ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్మన్‌గా మేడిశెట్టి శేషారావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే వైస్ ఛైర్మన్‌గా కవల నారాయణ మూర్తి ప్రమాణం చేశారు. అనంతరం 32 మంది కౌన్సిలర్లతో ఆర్డీఓ, మున్సిపల్ స్పెషలాఫీసర్ సరళావతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
నూతన కౌన్సిలర్లకు మంత్రి సుభాష్ సూచనలు
ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్లకు మంత్రి వాసంశెట్టి సుభాష్ పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల విజయం తమ బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులకు ప్రజలు మద్దతునిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఆశీర్వదించారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించాలని సూచించారు. గొడ్డలి పార్టీ గత 2024 ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు ఈవీఎంల తేడా అన్నారని మండిపడ్డారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైనప్పుడు ఓటమిపై రివ్యూ చేయకుండా ఈవీఎంల తేడా అంటూ గోల పెట్టారని విమర్శించారు.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో దారుణమైన పరిస్థితిని గొడ్డలి పార్టీ ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. పార్టీ కండువా వేసుకుని నామినేషన్ వేసే పరిస్థితి గొడ్డలి పార్టీకి లేదన్నారు. ఆ జెండా కనబడితే ఓట్లు వేయరని భావించి ఇండిపెండెంట్‌లుగా నామినేషన్ వేసే దౌర్భాగ్య పరిస్థితి గొడ్డలి పార్టీకి వచ్చిందంటూ మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
ప్రజల ఆదరణతో విజయవాడలో కూటమి ఘన విజయం: ఎంపీ కేశినేని శివనాథ్
Read Latest AP News And Telugu News