Share News

ప్రజల ఆదరణతో విజయవాడలో కూటమి ఘన విజయం: ఎంపీ కేశినేని శివనాథ్

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:49 PM

విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ప్రజల ఆదరణతో కూటమి ఘన విజయం సాధించిందని విజయవాడ ఎంపీ అన్నారు.

ప్రజల ఆదరణతో విజయవాడలో కూటమి ఘన విజయం: ఎంపీ కేశినేని శివనాథ్
MP Kesineni Chinni

విజయవాడ, నవంబర్ 23: నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల ఆదరణతో కూటమి ఘన విజయం సాధించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో మొదట మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం చేశారని.. అనంతరం కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని తెలిపారు. చెన్నుపాటి కాంతిశ్రీనీ డిప్యూటీ మేయర్‌గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. ఇంతటి భారీ విజయం సాధించడం వెనుక కూటమి కృషి ఉందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించారన్నారు.


ఎన్నికైన సభ్యులు అందరూ విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తారని ఎంపీ తెలిపారు. విజయవాడకు పూర్వ వైభవం తీసుకువస్తారని.. అందరి ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళతారన్నారు. చెన్నుపాటి కాంతిశ్రీ కుటుంబం పార్టీకి చాలా సేవ చేసిందని చెప్పారు. వైసీపీ అరాచక పాలనలో వారి భర్త కన్ను పోయిందని అన్నారు. వీరోచితంగా పోరాడిన కుటుంబానికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని నిర్ణయించామని.. వారి కుటుంబ ధైర్యసాహసాలకు మెచ్చుకుని సీఎం చంద్రబాబు డిప్యూటీ మేయర్ ఇచ్చారని వివరించారు.


ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: మేయర్ వంగవీటి రాధాకృష్ణ

అంబేడ్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని.. అంబేడ్కర్ పాదాల చెంత ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని మేయర్ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని మేయర్ తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్న అందరికీ చెన్నుపాటి కాంతి శ్రీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేషన్‌లో ఉన్న అవసరాలను మేయర్‌తో కలిసి గుర్తిస్తామన్నారు. అందరినీ కలుపుకుని తనవంతు తోడ్పాటు అందిస్తానని చెన్నుపాటి కాంతి శ్రీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:13 PM