Share News

రాష్ట్ర పండుగగా భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి: నారా లోకేశ్

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:45 AM

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి నేడు. ఈ సందర్భంగా సాయి భక్తులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర పండుగగా భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి: నారా లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, నవంబర్ 23: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి నేడు. ఈ సందర్భంగా సాయి భక్తులకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. ‘భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి.. జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా’.


’భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం

చేతిలో డబ్బు నిలవాలంటే ఈ తప్పులు చేయకండి..

Updated Date - Nov 23 , 2026 | 08:01 AM