చేతిలో డబ్బు నిలవాలంటే ఈ తప్పులు చేయకండి..
ABN , Publish Date - Nov 23 , 2026 | 07:14 AM
రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తారు. కానీ వచ్చిన ఆ నగదు చేతిలో నిలవదు. వెంటనే ఖర్చు అయిపోతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: రాత్రింబవళ్లు కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తారు. కానీ వచ్చిన ఆ నగదు చేతిలో నిలవదు. వెంటనే ఖర్చు అయిపోతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. అందుకు కొన్ని తప్పులే కారణమని చాణక్యుడు వివరిస్తున్నారు.
గొప్పలు చెప్పుకోవడానికి..
చాలా శాతం మంది తమ వద్ద ఉన్న డబ్బును ప్రదర్శించేందుకు తెగ తాపత్రయ పడతారు. అలాగే ఏ మాత్రం ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. ఈ బలహీనతను ఇతరులు ఆసరాగా తీసుకుంటారు. అలాంటి వారి వద్ద డబ్బు ఎక్కువ కాలం నిలవదు. ఈ నేపథ్యంలో డబ్బును ఎక్కడ ప్రదర్శించవద్దు. ఇలా ప్రదర్శిస్తే.. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
పొదుపు చేయడం లేదు..
చాలా మంది తమ సంపాదనలో ఎంతో కొంత పక్కన పెట్టాలి. ఇలా ప్రతి నెల చేయడం వల్ల ఏడాదిలో కొంత పెద్ద మొత్తంలో నగదు సమకూరుతుంది. దీనిని కుటుంబంలో ఓ మంచి పని కోసం వినియోగించ వచ్చు. కానీ చాలా మంది ఇలా పొదుపు చేయరు. వచ్చిన జీతాన్ని మంచి నీళ్లులాగా ఖర్చు చేసేస్తారు. అలాంటి వారు.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు పొదుపు చేయని వారు భవిష్యత్తులో చాలా చిక్కుల్లో పడతారు.
వ్యసనాలు బారిన పడితే..
కుటుంబంలో ఓ వ్యక్తి వ్యసనానికి బానిస అయితే.. అతడి ఆలోచన శక్తితోపాటు గ్రహణ శక్తి తగ్గిపోతాయి. దీంతో అతడు నగదును తెలివిగా ఖర్చు చేయలేడు. ఈ కారణంగా ఆ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంది.
ఏదీ ఏమైనా ఉద్యోగంలో జీతం.. వ్యాపారంలో లాభం రూపంలో చేతికి వచ్చిన డబ్బులో కొంత పొదుపు చేసుకోవాలి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా అనర్థాల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని చాణక్యుడు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలా? చాణక్యుడు చెప్పిన సింపుల్ చిట్కాలు ఇవే..
గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈ వారం పెరగనున్నాయా?