Share News

నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Nov 23 , 2026 | 01:42 PM

కాంగ్రెస్ ఆర్గనైజేషన్ బలోపేతంపై ఇన్‌ఛార్జ్‌ సందీప్ కుమార్‌తో చర్చించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పార్టీలో విభేదాలు లేవని.. విబేధాలు లేనప్పుడు చర్చ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు.

నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka

హైదరాబాద్, నవంబర్ 23: గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ(AICC) వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ బీఎం సందీప్ కుమార్‌తో మంత్రులు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్‌తో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ బలోపేతంపై ఇన్‌ఛార్జ్‌తో చర్చించామన్నారు. పార్టీలో విభేదాలు లేవని.. విబేధాలు లేనప్పుడు చర్చ ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు అంటూ మండిపడ్డారు.


తెలంగాణ నీటి వాట కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తోందని భట్టి తెలిపారు. బీఆర్ఎస్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ ఊహా ప్రపంచంలో బతుకుతున్నారని.. సోషల్ మీడియా లోకంలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ‘ప్రభుత్వ వ్యవస్థలను బీఆర్ఎస్ కుప్పకూల్చింది.. దాన్ని సరిదిద్దుతుంటే మాపై ఆరోపణలా?’ అంటూ ఫైర్ అయ్యారు. పేద కుటుంబాన్ని వెతికి మరీ సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్‌కు అధికారం అనేది ఇక కలే అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు


ఇవి కూడా చదవండి..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా.. మంత్రి కోమటిరెడ్డి ధీమా

బీఆర్ఎస్ హయాంలో మాటలు ఎక్కువ.. పని తక్కువ.. కాంగ్రెస్‌లో అందుకు భిన్నం: ఉత్తమ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 01:50 PM