బీఆర్ఎస్ హయాంలో మాటలు ఎక్కువ.. పని తక్కువ.. కాంగ్రెస్‌లో అందుకు భిన్నం: ఉత్తమ్
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:55 AM
గాంధీ భవన్‌తో సెంటిమెంటల్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో ఏడేళ్ల పాటు పీసీసీ చీఫ్‌గా పని చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 23: గాంధీ భవన్‌తో సెంటిమెంటల్, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌తో మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కష్టకాలంలో ఏడేళ్ల పాటు పీసీసీ చీఫ్‌గా పని చేసినట్లు తెలిపారు. ‘నా శాఖలో అద్భుతమైన పని జరుగుతోంది. ఒక్క రోజు, ఒక్క గంట కూడా విరామం లేకుండా పని చేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో మాటలు ఎక్కువ పని తక్కువంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు తక్కువ.. పనులు ఎక్కువన్నారు. బీఆర్ఎస్‌వి బోగస్ మాటలంటూ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. సంక్షేమంలో వేగంగా దూసుకుపోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
పార్టీ అంతర్గత విషయాలపై చర్చించా: మంత్రి తుమ్మల

కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలను ఇన్‌ఛార్జ్‌తో చర్చించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇన్‌ఛార్జ్ చెప్పారన్నారు. ఏఐసీసీ, రాష్ట్ర పార్టీ కలిసి పని చేయాలని చెప్పానని.. రెండూ కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇన్‌ఛార్జ్‌కు చెప్పినట్లు తెలిపారు. ‘నా వంతు నేను ప్రయత్నం చేస్తా.. మీరు చేసే పని చేయండి అని ఇన్‌ఛార్జ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాడానికి అందరూ కష్టపడి పని చేయాలని ఇన్‌ఛార్జ్ చెప్పారు’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా.. మంత్రి కోమటిరెడ్డి ధీమా
Read Latest Telangana News And Telugu News