ఏపీ క్యాబినెట్ భేటీపై కీలక నిర్ణయం.. ఈసారి హైబ్రిడ్ విధానంలో సమావేశం
ABN , Publish Date - Nov 23 , 2026 | 08:23 AM
ఏపీ క్యాబినెట్ భేటీ ఈ నెల 27న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించింది.
అమరావతి, నవంబర్ 23: ఏపీ క్యాబినెట్ భేటీ ఈ నెల 27న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని.. అలా వీలు మంత్రులు వర్చువల్గా హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం క్యాబినెట్ నోట్ జారీ చేశారు.
అసలు అయితే.. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ క్యాబినేట్ సమావేశం.. నవంబర్ 26న జరగాల్సి ఉంది. కానీ నవంబర్ 26వ తేదీ రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కారణంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 27కు ఈ క్యాబినెట్ భేటీని వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్ర పండుగగా భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి: నారా లోకేశ్
చేతిలో డబ్బు నిలవాలంటే ఈ తప్పులు చేయకండి..