వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా.. మంత్రి కోమటిరెడ్డి ధీమా
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:39 AM
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు(సోమవారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు స్థానాలను గెలుస్తామన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు రానున్న ఎన్నికలకు కీలకమని చెప్పుకొచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు కచ్చితంగా వస్తాయి.. నా ప్లాన్ ప్రకారం 100 సీట్లు పక్కా’ అని స్పష్టం చేశారు. సంవత్సరాలుగా కష్టపడి పార్టీలో పని చేసే వారికి పదవులు ఇవ్వాలని ఇన్‌ఛార్జ్‌ను కోరినట్లు తెలిపారు.
12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని మంత్రి అడిగారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం 96 శాతం భూసేకరణ పూర్తి చేశామన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వకుండా టెండర్లను మూడుసార్లు వాయిదా వేసిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారని.. రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు అప్రూవల్ వచ్చినా కేంద్రం ఎందుకు పెండింగ్ పెట్టిందని ప్రశ్నించారు.
కేంద్రం నిధులు వద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. తాము అన్ని అనుమతులు సిద్ధం చేసినా బీజేపీ రాజకీయాలు చేస్తోందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏం ఒరగబెట్టారని అమిత్ షా, నితిన్ నబిన్, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం తక్షణమే కేబినెట్ ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మార్కెట్ల పతనం, ఇరాన్ దాడులకు డెమోక్రాట్ల విజయమే కారణం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
సత్యసాయి బాబా సేవలు చిరస్మరణీయం.. సీఎం చంద్రబాబు నివాళి
Read Latest Telangana News And Telugu News