Share News

కేఆర్ఎంబీ సమావేశం వేళ బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం.. ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:21 AM

కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు, హక్కులపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఈ రోజు (సోమవారం) హైదరాబాద్‌లో సమావేశమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు బీఆర్‌ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కేఆర్ఎంబీ సమావేశం వేళ బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం.. ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు
brs leaders house arrest

హైదరాబాద్, నవంబరు 23: కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాలు, హక్కులపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఈ రోజు హైదరాబాద్‌లో సమావేశమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు బీఆర్‌ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్, సబితాలను గృహనిర్బంధం చేశారు. కాగా.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బోర్డు సభ్యులను కలిసి.. ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి అనుతులు లేకుండా చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా ఏపీకి తరలించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యులను కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.


ఈ నేపథ్యంలో.. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు జలసౌధానికి చేరుకుంటారనే సమాచారం మేరకు.. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలను గృహనిర్భంధం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా సమస్యలను విన్నవించడానికి బోర్డు సభ్యులను అధికారికంగా కలుస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు.. ప్రజాస్వామ్య పద్దతిలో ఫిర్యాదు చేయడానికి వెళ్లాలనుకుంటే.. గృహనిర్భంధాలు ఏమిటి’ అని ప్రశ్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 11:22 AM