Share News

గ్లోబల్ సమ్మిట్‌కు ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎంట్రీ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:35 PM

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతినిధుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎంట్రీ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 23: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతినిధుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరవుతారని.. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వారికి ప్రవేశం కల్పించాలని సూచించారు. ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతినిధుల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని.. మెరుగైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని తెలిపారు. ప్రతినిధుల కోసం లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలను సమ్మిట్‌లో ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించే ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేశారు. ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలన్నారు. దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు సమ్మిట్‌లోని ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలో మాటలు ఎక్కువ.. పని తక్కువ.. కాంగ్రెస్‌లో అందుకు భిన్నం: ఉత్తమ్
నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:41 PM