అండాల అక్రమ సేకరణ కేసు.. హైకోర్టులో డాక్టర్లకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:06 PM
అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్లకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి డాక్టర్ పద్మజకు, డా.దుర్గారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 23: అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్లకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి డాక్టర్ పద్మజ, డా.దుర్గారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల న్యాయస్థానం డిస్మిస్ చేసింది. పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని వారి తరఫు న్యాయవాదులు వాదించారు.
అయితే, అమాయక యువతులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వారి నుంచి అండాలు సేకరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం డాక్టర్ పద్మజ, డాక్టర్ దుర్గారావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
నీళ్ల విషయంలో దొంగే దొంగ అన్నట్లుంది బీఆర్ఎస్ తీరు: భట్టి విక్రమార్క
గ్లోబల్ సమ్మిట్‌కు ఫేషియల్ రికగ్నిషన్‌తో ఎంట్రీ.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News