పెట్టుబడుల పేరుతో మోసం.. బీఆర్ఎస్ నేత అరెస్ట్
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:58 PM
మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఓ టీవీ చానెల్‌లో లైవ్ నుంచి బయటకు వస్తుండగా మాదాపూర్‌లో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మణికొండ బీఆర్ఎస్ నేత రూపారెడ్డిని (BRS Leader Roopa Reddy Arrest) పోలీసులు ఈరోజు (గురువారం) అరెస్ట్ చేశారు. ఓ టీవీ చానెల్‌లో లైవ్ నుంచి బయటకు వస్తుండగా మాదాపూర్‌లో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు.
ఇవాళ ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద భాదితులు ఆందోళన చేపట్టడంతో రూపారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డి కూతురుని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కుమారుడు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కి ఈ వివాహం చేసుకోవడం ఇష్టంలేక పోవడంతో తండ్రి, కొడుకుల మధ్య వివాదం నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. బాధితుల వెనుక ప్రకాశ్‌గౌడ్ ఉండి ఇదంత నడిపిస్తున్నారని రూపారెడ్డి ఆరోపించారు.
వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్
క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి దయాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News