Share News

బీర్‌..చీర్‌.. హైదరాబాద్‏లో పెరిగిన అమ్మకాలు

ABN , Publish Date - May 27 , 2026 | 07:52 AM

వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి.

బీర్‌..చీర్‌.. హైదరాబాద్‏లో పెరిగిన అమ్మకాలు
Summer, Beer Sales

  • గత సంవత్సరంతో పోలిస్తే 35-40శాతం వృద్ధి

హైదరాబాద్‌ సిటీ: వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఐపీఎల్‌ సీజన్‌ సాగుతుండటం.. వీకెండ్‌ పార్టీ కల్చర్‌ పెరగడంతో వీటికి డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. గత వేసవితో పోలిస్తే ఈ సంవత్సరం మైక్రోబ్రేవరీలలో అమ్మకాల పరంగా 30నుంచి 35 శాతం వృద్ధి కనిపిస్తోందని పలు మైక్రోబ్రేవరీల ప్రతినిధులు తెలిపారు. జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మైక్రోబ్రేవరీలన్నింటిలో వారాంతాల్లో ప్రవేశించడమే కష్టంగా ఉంటోందని, మిగిలిన రోజులలో కూడా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదని తెలిపారు.


పెరుగుదలకు కారణాలివే..

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరంలోని ప్రతి మైక్రోబ్రేవరీ రోజుకు గరిష్టంగా 1000 లీటర్ల కంటే ఎక్కువ బీరు ఉత్పత్తి చేయడానికి లేదు. ఈ వెయ్యి లీటర్లలోనే నాలుగు నుంచి ఆరు వరకూ ఫ్లేవర్లను పలు మైక్రోబ్రేవరీలు ఉత్పత్తి చేస్తుంటే, వారాంతాలలో ఈ వెయ్యి లీటర్ల అమ్మకాలు పూర్తి అయిపోతున్నాయని జూబ్లీహిల్స్‌లోని ఓ మైక్రోబ్రేవరీ సంస్థ మేనేజర్‌ పేర్కొంటున్నారు.


city2.3.jpgనగరంలో బీర్ల అమ్మకాలు గణనీయంగా జరగడానికి వేసవి వేడితో పాటుగా ఐపీఎల్‌ సీజన్‌ కూడా ఓ కారణమని జూబ్లీహిల్స్‌లోని ఓ మైక్రోబ్రేవరీ ప్రతినిధి ఆదిత్య అంటున్నారు. నగరంలో బీర్ల రుచుల వైవిధ్యత పరంగా ప్రతి బ్రేవరీ తమదైన సిగ్నేచర్‌ను ఉత్పత్తిలో చూపుతోంది. నగరంలో ఇప్పుడు ఫ్రూట్‌, సైడర్‌ బీర్లు మరీ ముఖ్యంగా మ్యాంగో సైడర్‌, స్ట్రాబెర్రీ, యాపిల్‌ సైడర్‌ బీర్లతో పాటుగా బెల్జియన్‌ విట్‌, హైఫెవైజెన్‌ వంటి బీర్ల అమ్మకాలు అధికంగా ఉన్నాయంటున్నారు బ్రేవరీల ప్రతినిధులు.


ఇవేకాకుండా మ్యాంగో చిల్లీ ఏల్‌, బాస్మతి ప్రీమియం లాగర్‌, హైబిస్కస్‌ సైడర్‌ వంటి ఫ్లేవర్లను ఈ బీర్లలో ఉత్పత్తి చేస్తున్నారంటున్నారు బీర్ల ప్రేమికులు. వీటికి తోడు చెఫ్‌లు సృష్టిస్తోన్న ఆహారం, లైవ్‌ మ్యూజిక్‌, స్పోర్ట్స్‌, గేమింగ్‌ జోన్లు కూడా మైక్రోబ్రేవరీలు కళకళలాడిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

నేడు చర్లపల్లి-దానాపూర్‌ మార్గంలో వన్‌వే ప్రత్యేక రైలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 07:52 AM