Share News

పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయాలి: టీజీ వెంకటేశ్‌

ABN , Publish Date - May 27 , 2026 | 06:25 AM

పంచ్‌ ప్రభాకర్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, అతడిని కటకటాల్లో పెట్టేవరకు ఆర్యవైశ్య సమాజం నిద్రపోదని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్‌ టీజీ వెంకటేశ్‌ హెచ్చరించారు.

పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేయాలి: టీజీ వెంకటేశ్‌

కర్నూలు కల్చరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి): పంచ్‌ ప్రభాకర్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, అతడిని కటకటాల్లో పెట్టేవరకు ఆర్యవైశ్య సమాజం నిద్రపోదని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్‌ టీజీ వెంకటేశ్‌ హెచ్చరించారు. పంచ్‌ ప్రభాకర్‌ చేసిన అసత్య ఆరోపణలపై జిల్లాల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కర్నూలులో చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే పంచ్‌ ప్రభాకర్‌ అనే ప్రవాసాంధ్రుడు ఆర్యవైశ్య కమ్యూనిటీపై తీవ్ర విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. రాయలసీమలో మీసాలు తిప్పుకుని తిరిగిన నాయకులే మీసాలు దించుకొని తన దగ్గరకు వచ్చారని మాత్రమే తాను అన్నానని, అయితే రెడ్డి జాతి కమ్యూనిటీని అన్నానని పంచ్‌ ప్రభాకర్‌ అనడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు. నిజంగా ప్రభాకర్‌ అనే వ్యక్తికి ధైర్యం ఉండి, ఇండియాకు వస్తే ఆర్యవైశ్యులు ఆయన్ను తన్నుకుంటూ తీసుకుపోతారని అన్నారు.

Updated Date - May 27 , 2026 | 06:26 AM