ప్రజల ముందుకు రెండేళ్ల విజయాలు: అచ్చెన్న
ABN , Publish Date - May 27 , 2026 | 06:20 AM
కార్యకర్తే అధినేత అని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదికే టీడీపీ మహానాడు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): కార్యకర్తే అధినేత అని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదికే టీడీపీ మహానాడు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను మహానాడు వేదికగా ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. స్త్రీశక్తి నినాదంతో నవశకానికి నాంది పలికే మహానాడులో అభివృద్ధి విఘాత రాజకీయలను ఎండగడతామని చెప్పారు. మహిళా శక్తి, యువశక్తి, రైతు సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో మహానాడు-2026 కొత్త దిశగా ముందుకు సాగుతుందన్నారు.