Share News

తెలంగాణ ట్రాన్స్‌కో డీఈపై అవినీతి ఆరోపణలు.. ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Jul 22 , 2026 | 08:11 AM

తెలంగాణ ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు.

తెలంగాణ ట్రాన్స్‌కో డీఈపై అవినీతి ఆరోపణలు.. ఏసీబీ సోదాలు
ACB Raids

హైదరాబాద్, జులై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌కు చెందిన డిప్యూటీ ఇంజినీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ (Transco DE Muthyam Venkataramana) నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు (ACB Raids) ఈరోజు (బుధవారం) విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ముత్యం వెంకటరమణకు చెందిన హైటెక్స్‌లోని మీనాక్షి స్కై లాంచ్ నివాసాల్లో తనిఖీలు చేశారు.


హైదరాబాద్‌లో 9 ప్రాంతాలు, ఖమ్మంలో ఒక బృందం మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా విదేశీ మద్యం, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఖరీదైన వాచీలు , నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఈ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


డీఈ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు: డీఎస్పీ మజీద్ అలీఖాన్

డీఈ ముత్యం వెంకటరమణ 2019లో రూ.26 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపారు. అప్పటినుంచి అతనిపై నిఘా ఉంచామని అన్నారు. ముత్యం వెంకటరమణ నివాసంలో రెండోసారి ఏసీబీ రైడ్స్ చేస్తున్నామని వెల్లడించారు. అతని భార్య స్వప్న పేరుపై నిర్మాణ రంగంలో 10 ఫ్లాట్స్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆంజనేయనగర్, మూసాపేటలో ఈ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. ఆంజనేయనగర్, మూసాపేటలో నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ G+3 కమర్షియల్ భవనాలు గుర్తించామని అన్నారు.


ఖానామెట్ గుట్టల బేగంపేటలో G+5 కమర్షియల్ బిల్డింగ్‌లు గుర్తించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నగదు, పత్రాలు, గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ, ఫారిన్ లిక్కర్ గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ముత్యం వెంకట రమణ డిప్యుటే షన్‌పై రెడ్ కోలో ఉన్నారని ప్రస్తావించారు. ముత్యం వెంకటరమణ 56 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ శాఖలో పని చేస్తూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కియా, మహీంద్రా, బెలినో కంపెనీలకు చెందిన మూడు కార్లు కూడా ఆయన దగ్గర ఉన్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. వీటి విలువ లెక్కించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ మజీద్ అలీఖాన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ

ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల

ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 11:10 AM