Share News

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 13 , 2026 | 06:53 AM

హైదరాబాద్ గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సూర్యాపేట జిల్లాకు చెందిన భరత్‌(29)గా గుర్తించారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Hyderabad Gachibowli Software Employee Death

హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సూర్యాపేట జిల్లాకు చెందిన భరత్‌(29)గా గుర్తించారు. యువకుడు బెంగళూరులోని ఓసాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని 'గోల్ఫ్ ఎడ్జ్' అపార్ట్‌మెంట్‌లో అతను అద్దెకు దిగాడు.


భవనం 30వ అంతస్తు నుంచి కింద ఉన్న కారుపై భరత్ దూకాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా యువకుడు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువు కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 07:19 AM