Share News

జీడిమామిడి చెట్లు కనుమరుగు

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:21 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజు తోటలు కనుమరుగవుతున్నాయి. నాలుగు దశా బ్ధాల కిందటి నుంచే జీడిమామిడిని జిల్లా రైతులు సాగు చేస్తున్నారు.

జీడిమామిడి చెట్లు కనుమరుగు
Cashew Farming

  • వందల ఎకరాల్లో తోటలు నరికివేత..

నెన్నెల(మంచిర్యాల): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజు తోటలు కనుమరుగవుతున్నాయి. నాలుగు దశా బ్ధాల కిందటి నుంచే జీడిమామిడిని జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. కానీ కాజు ప్రాసెసింగ్‌ విధానం తెలియక మరోవైపు జీడి (కాజు)గింజల మార్కె టింగ్‌పై అవగాహన లేక నష్టపోయారు. ఇక్క డి రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసు కొని పట్టణ ప్రాంత వ్యాపారులు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి లాభాలు గడించారు. కానీ సాగు చేసిన రైతులు మాత్రం నష్టాలను మూ టగట్టుకున్నారు. తోటలు ముదిరి కొన్ని సంవత్సరాలుగా దిగుబడి రాక పోతుండటంతో నిర్వహన రైతులకు భారంగా మారింది. నష్టాల్లో కూ రుకుపోయిన రైతులు కాజు చెట్లను నరికేస్తున్నారు. అక్కడక్కడ తప్ప కాజు చెట్లు కానరావడం లేదు. జాతీయ, అంతర్జాతీయ డ్రైఫ్రూట్స్‌ మార్కె ట్లో మంచి డిమాండ్‌ ఉన్న కాజును పండించే తోటలు ఇక గత వైభవంగా మిగిలిపోనున్నాయి.


చిత్తాపూర్‌ ఫేమస్‌...

దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నెన్నెల మండలం చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌.వీ. రాజిరెడ్డి అనే భూస్వామి ఇక్కడి భూములు మామిడి, జీడిమా మిడి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించి వందల ఎకరాల్లో తోటలు నాటారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న పరిసర గ్రామాల రైతులు సైతం జీడి మామిడి, మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బెల్లంపల్లి, భీమారంలో నర్సరీలు ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని మండలాల గిరిజనులకు మామిడి, జీడి మామిడి మొక్కలను ఉచితంగా అందజేశారు. ఎరువు లు, మందులు అందజేసి, బోర్లు వేసి తోటల పెం పకాన్ని ప్రొత్సహించారు. గతంలో జిల్లాలో దాదాపు నాలుగు వేల ఎకరాల వరకు ఉన్న సాగు విస్తీర్ణం రానురాను పూర్తిగా తగ్గిపోతోంది. చిత్తాపూర్‌లోనే రెం డు వందల ఎకరాల వరకు జీడితోటలు ఉండేవి. భూ స్వాముల భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఆ భూముల్లో కాజు తోటలను తొలగించి పత్తి సాగు చేస్తున్నారు.


mnc2.2.jpgప్రాసెసింగ్‌ విధానం తెలియక నష్టం..

మొదట్లో జీడి గింజల నుంచి కాజు పలుకులు తయారు చేసే ప్రాసెసింగ్‌ విధానం తెలియక కొన్నాళ్లు రైతులు నష్ట పోయారు. అప్పట్లో మార్కెట్లో కాజుకు ఉన్న డిమాండ్‌ తెలియక మధ్య దళారులకు అతి తక్కువ ధరకు పచ్చి గింజలు అమ్ముకు న్నారు. తీరా యా జమాన్య పద్దతులు, ప్రాసెసింగ్‌ విధానం, మార్కెట్‌ మెలుకువలు తెలుసుకునే సరికి చెట్లు ముదిరి కాత కాయడం మానేశాయి. యేటికేడు చెట్లల్లో బలంతగ్గి పూతకు రావడమే మానేశాయని రైతులంటున్నారు. ఇలా ఎన్నాళ్లని చూస్తామని వాటిని తొలగించి ఇతర పంట పండిచుకునేందుకు చెట్లు నరికి వేస్తున్నామని చె బుతున్నారు. జీడి మామిడి తోటల్లో ఇతర అంతర పం టలు వేసే వీలు లేక పోవడంతో భూమి ఉండి కూడా లాభం లేకుండా పోతోందని పేర్కొంటున్నారు. చెట్లు తొలగించి చదును చేసిన భూమిని పత్తి పంటకు కౌలుకు ఇస్తే ఎకరానికి రూ.20 వేల వరకు కౌలు వస్తుందని రైతులు పేర్కొన్నారు. మిగిలి ఉన్న తోటల ను టాప్‌ వర్కింగ్‌తో పునరుద్దరించే వీలుంది. అధికా రులు ఆ దిశగా కృషి చేస్తే జీడి తోటలు మళ్లీ జీవం పోసుకుంటాయి.


గింజ.. పండు.. పిప్పి.. అన్నీ పనికొచ్చేవే..

జీడిమామిడి కాయకు కింది భాగంలో గింజ ఉంటుంది. పక్వానికి వచ్చిన పండు నుంచి గింజను వేరు చేస్తారు. నూనె (జీడీ)తో నిండి ఉండే గింజను ప్రాసెస్‌ చేస్తేనే తెల్లని కాజు తయారవుతుంది. జీడి పప్పునకు ఎంత క్రేజ్‌ ఉందో డ్రైఫూట్స్‌ తినే వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ మార్కె ట్లో కాజుకు మంచి డిమాండ్‌ ఉంది.


mnc2.jpgగింజలు సేకరించిన తరువాత మిగిలిపోయిన పండ్లు కూడా పలు విధాలుగా పనికి వస్తాయి. పండు తియ్యగా, వగరుగా ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది. దీన్ని పిల్లలు ఇష్టం గా తింటారు. జీడిమామిడి పండ్ల రసం తో కూల్‌ డ్రింక్స్‌, గుజ్జుతో జామ్‌, మిక్స్‌డ్‌ ప్రూట్‌ జామ్‌, చట్నీ, టాఫీ, వెనిగర్‌, తయారు చేస్తారు. గోవాలో లభించే ఫెన్నీ అనే ఫే మస్‌ డ్రింక్‌ జీడి పండ్ల రసంతోనే తయార వుతుంది. జ్యూస్‌ తీసిన తరు వాత వచ్చే పిప్పి కూడా చాలా రకాలుగా ఉపయోగపడు తుంది. దాన్ని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా, వర్మీ కంపోస్టుగా ఉపయోగి స్తారు. ఈ పిప్పి నుంచి పెక్టిన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తారు. పెక్టిన్‌ను జామ్‌, సాస్‌, కెచప్‌ల తయారీలో చిక్కదనం కోసం వాడతారు.


జీడి పండ్లలో ఎన్నో ఔషధగుణాలు కూడా ఉన్నాయి. నీళ్ల విరేచనాలు, స్కర్వీ వ్యాధికి, మూ త్రపిండాల సమస్యలు, డ్రాప్సీ వ్యాధి నివారణకు వాడే మందులు జీడి మామిడి పండ్లతో తయారు చేస్తారు. జీడి పండ్లతో తయారు చేసే నాటుసారాను గిరిజనులు ఇష్టంగా సేవిస్తారు. ఇన్ని ఉపయోగాలున్న జీడిమామిడి మన ప్రాంతంలో కను మరుగు కావడం బాధాకరం.


ఈ వార్తలు కూడా చదవండి:

కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి

అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 12:21 PM