Share News

హాకీ.. ఏకాకి..

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:11 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాకీ క్రీడ ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ క్రీడను ప్రోత్సహించే వారు లేక పోవడం, వర్థమాన క్రీడాకారులకు తర్ఫీదు అందించే అసోసియేషన్ల పర్యవేక్షణ లోపం కారణంగా ఔత్సాహికులు ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపడం లేదని సీనియర్‌ క్రీడాకారులు వాపోతున్నారు.

 హాకీ.. ఏకాకి..
National Sports Day

  • దేశవాళీ క్రీడకు ప్రోత్సాహం కరువు

  • జేఎన్‌ఎస్‌లో కోర్టు లేక ఔత్సాహికులు ఇబ్బందులు

  • నేడు ధ్యాన్‌ చంద్‌ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాకీ క్రీడ ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ క్రీడను ప్రోత్సహించే వారు లేక పోవడం, వర్థమాన క్రీడాకారులకు తర్ఫీదు అందించే అసోసియేషన్ల పర్యవేక్షణ లోపం కారణంగా ఔత్సాహికులు ఈ క్రీడ పట్ల ఆసక్తి చూపడం లేదని సీనియర్‌ క్రీడాకారులు వాపోతున్నారు. దేశ వాళీ క్రీడగా ప్రసిద్ధి గాంచిన హాకీ క్రీడకు మైదానంతో పాటు కోచ్‌లు సైతం అందుబాటులో లేని కారణంగా ఈ క్రీడ అంతరించి పోయే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేయూ, నిట్‌ కళాశాలల్లో సైతం విద్యార్థులు శిక్షణ తీసుకునేందుకు హాకీ కోర్టులు అందుబాటులో లేక పోవడంతో ఆదరణ తగ్గిపోతోంది.


గత 30 ఏళ్లుగా నయీంనగర్‌ లోని ‘కుడా’ మైదానంలో కొందరు సీనియర్‌ క్రీడాకా రులు హాకీ క్లబ్‌ ఏర్పాటు చేసుకొని వర్థమాన క్రీడాకా రులకు అరకొర వసతులతో శిక్షణ అందిస్తున్నారు. ఒలంపిక్స్‌ పురుషుల హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి మూడు పసిడి పతకాలను అందించి హాకీ మాంత్రికుడిగా మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పేరుగాంచారు. 1905 ఆగస్టు 29న ధ్యాన్‌చంద్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన సాధించిన ఘనతకు గుర్తుగా ప్రతి ఏట భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


kza1.2.jpgసీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు పెద్ద పీట వేస్తూ, క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ మహానగరంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు తో పాటు వరంగల్‌ నగరంలో అంత ర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రికెట్‌ స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటు కు ప్రత్యేక బడ్జెట్‌ కేటా యించి ఏడాది గడుస్తున్న నేటికి పనుల్లో ఎలాంటి కదలిక లేక పోవడంతో జిల్లా వాసులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.


kazi2.jpgజేఎన్‌ఎస్‌లో హాకీ కోర్టు కరువు...

2005కు ముందు జేఎన్‌ఎస్‌లో అన్ని క్రీడలకు ఉన్నట్లే హాకీ క్రీడకు కోర్టు ఉండేది. గతంలో వర్ధమాన క్రీడాకారులకు జేఎన్‌ఎస్‌ శిక్షణ కేంద్రంగా ఉండేది. హాకీ జట్టుకు చీఫ్‌ కోచ్‌గా ప్రాతినిధ్యం వహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందల సంఖ్యలో క్రీడాకారులకు తర్ఫీదుల ఇచ్చి, రాష్ట్రానికి, దేశానికి పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించడం లో క్రీయాశీలకంగా వ్యహరించి రిటైర్డు అయిన పెరుమాళ్‌ మధుకర న్‌ ములుగు వాసి కావడం జిల్లాకే గర్వకారణం. అదే విధంగా వర్థన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు జేఎన్‌ మైదానంలో హాకీలో శిక్షణ పొందినవారే. జేఎన్‌ఎస్‌ లో హాకీ క్రీడలో శిక్షణ పొందడానికి కోర్టు ఏర్పాటు చేయాల్సిన డీఎస్‌ఏ అధికారులు అవేమి పట్టించు కోకుండా, నిర్లక్ష్య ధోరణి కారణంగా నేడు ఈ క్రీడకు జిల్లాలో ఆదరణ కరువైందన సీనియర్‌ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు.


హాకీ క్రీడను ప్రోత్సహించాలి..

  • సోదా రామకృష్ణ, హాకీ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు

సాధన చేసేందుకు కావలసిన మైదానాలు లేకపోవడంతో హాకీ క్రీడ మరుగున పడుతోంది. కొన్నేళ్ల క్రితం హనుమకొండ జేఎన్‌ఎస్‌లో హాకీ క్రీడకు కోర్టు ఉండేది. రాను రాను జేఎన్‌ఎస్‌ లో హాకీ కోర్టు అందుబాటులో లేకుండా కొన్ని క్రీడలకే మైదానం పరిమితమయ్యింది. జిల్లాలో హాకీ క్రీడను బతికించడానికి జిల్లా హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పరకాల, హనుమకొండ నయీంనగర్‌ హాకీ క్లబ్‌ లో సాధన చేస్తున్న చిన్నారులకు హాకీ స్టిక్‌లు, కీడ్రా సామాగ్రిని సొంతంగా కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నాము.


హాకీ కోర్టులు ఏర్పాటు చేయాలి..

  • హుస్సెన్‌, హాకీ కోచ్‌ మామునూర్‌

గతంలో హాకీ క్రీడకు ఆదరణ ఉండటంతో క్రీడా మైదానాలు హాకీ క్రీడాకారులతో కళకళలాడేది. కానీ కొన్ని సంవత్సరాలుగా సాట్‌, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ)లు పట్టింపు లేని కారణంగా హాకీ క్రీడకు కోర్టులు లేక పోవడంతో విద్యార్థులు ఈ ఆట పట్ల ఆసక్తి చూపడం లేదు. జేఎన్‌ఎస్‌లో హాకీ కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు కోచ్‌ను నియమించేలా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు చొరవచూపాలి.


హాకీ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తాం...

  • నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే

వరంగల్‌ నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు చేయాలని గతేడాది నాతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్టేడియం నిర్మాణం కోసం స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధి, ధర్మసాగర్‌ మండలం ఉనికిచర్ల వద్ద జాతీయ రహదారి పక్కన కూడా లేఅవుట్‌ ఆధీనంలోని దాదాపు 30ఎకరాల స్థలం అందుబాటులో ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లాము. సానుకూలంగా స్పందించిన సీఎం వరంగల్‌లో క్రికెట్‌ స్టేడియానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత స్పోర్ట్స్‌ అథారిటీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఉనికిచెర్ల సమీపంలో కూడా లేఆవుట్‌ కు సంబంధించిన ప్రభుత్వ స్థలంలో చిన్న చిన్న భూసమస్యలు ఉండటం వలన కొంత మేర జాప్యం జరుగుతోంది. దీనిపై త్వరలోనే జిల్లాలోని ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో చర్చించి స్టేడియం, క్రీడా పాఠశాలతో పాటు హాకీ కోర్టు నిర్మాణం కోసం కృషి చేస్తాం.


ఈ వార్తలు కూడా చదవండి:

అడ్రస్‏లో లేరంటూ.. పేర్లు గల్లంతు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 12:11 PM