Share News

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:46 AM

భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం
Hyderabad Metro

హైదరాబాద్, ఆగస్టు 29: భాగ్యనగరంలో మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ముందుగానే టికెట్లు కొనుగోలు చేసుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ తీసుకున్నప్పటికీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద స్కానింగ్ సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ సేవలు పనిచేయకపోవడంతో మెట్రో స్టేషన్ సిబ్బంది కూడా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.


ఆన్‌లైన్ టికెట్ తీసుకున్న తర్వాతా గేట్ల వద్ద వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండటంపై మెట్రో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించి ఆన్‌లైన్ టికెటింగ్, స్కానింగ్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ

ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 12:18 PM