ముళ్లపొదల్లో మహిళ మృతదేహం... ముఖంపై యాసిడ్ పోసి దారుణం
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:13 AM
తమిళనాడు రాష్ట్రంలో తిరుపతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. అరుణ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు.
తిరుపతి, ఆగస్టు 29: తమిళనాడు రాష్ట్రంలో తిరుపతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. అరుణ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. నిండ్ర మండలానికి చెందిన అరుణ(50) బంధువుల వివాహం కోసం తమిళనాడుకు వెళ్లింది. అయితే తిరువళ్లూరు జిల్లా పొడటూర్ పేట సమీపంలోని ముళ్లపొదల్లో మహిళ శవమై తేలింది. అరుణ ముఖంపై యాసిడ్ పోసి దుండగులు దారుణంగా చంపేశారు. ఆపై ఆమె వద్ద ఉన్న 20 సవర్ల బంగారు నగలను అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు ఉత్తుకోట పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.
ముళ్లపొదల్లో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కేసు నమోదు చేసిన ఉత్తుకోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళను బంగారు నగల కోసం దోపిడీ దొంగలు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లికి వెళ్లిన అరుణ.. దారుణ హత్యకు గురవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
Read Latest AP News And Telugu News