ఆరు భటూరాల్లో.. గ్లాసు నిండా నూనె! వీడియో వైరల్
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:31 PM
నూనెలో వేయించిన భటూరాలను చాలా మందిగా ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే.. వాటిల్లో ఎంతమేర నూనె ఉంటుందో చూపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నూనెలో వేయించిన భటూరాలను(మైదా పూరీలు) చాలా మందిగా ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే.. వాటిల్లో ఎంతమేర నూనె ఉంటుందో చూపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 6 భటూరాలను చెరకు రసం మెషీన్‌లో వేయగా.. వాటి నుంచి సుమారు ఓ గ్లాసు నూనె బయటకు వచ్చింది.
వీడియోలో చూపిన ప్రకారం.. చెరకు రసం మెషీన్‌లో భటూరాలను వేసి ఆన్ చేయగానే.. అందులోంచి ఒక్కసారిగా నూనె బయటకు రావడం కనిపిస్తుంది. అలా 6 భటూరాలను వేశాక.. దాని వచ్చిన నూనెను గ్లాసులో వేస్తే అది గ్లాసు అంచులవరకు చేరింది. ఈ వీడియోను ఆచార్య మనీశ్ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో వేయించిన ఆహారంలో ఉండే నూనె పరిమాణంపై ఆయన అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని సూచించారు. గుండె సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, పీసీఓడీ వంటి ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారు.
నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తరచూ వేయించిన పదార్థాలను తరచూ తినేవారు తమ ఆహారపు అలవాట్లపై దృష్టి సారించాలని కొందరు వ్యాఖ్యానించగా.. ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, మితంగా తీసుకుంటే సరిపోతుందని మరికొందరు కామెంట్స్ చేశారు.
అయితే వీడియోలో చూపినట్టు గ్లాసులో సేకరించిన నూనె పరిమాణం ఆధారంగా.. భటూరాల్లోని మొత్తం నూనెను శరీరం ఎంతవరకూ గ్రహిస్తుందనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారించలేం. అలాగే భటూరాలు నేరుగా నిర్దిష్ట వ్యాధులకు కారణమవుతాయని కూడా ఇందులో నిరూపించలేదు. కానీ సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎక్కువ కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలను తగ్గించడం మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత