Share News

సీజేపీ నిరసన అట్టర్‌ ఫ్లాప్‌.. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:08 PM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసన విఫలమైందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. దేశ రాజధానిని బందీగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైనా విమర్శలు గుప్పించారు.

సీజేపీ నిరసన అట్టర్‌ ఫ్లాప్‌.. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర
Sambit Patra reacts on CJP Protest

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. నిరసన పేరిట దేశ రాజధానిని బందీగా మార్చేందుకు పలువురు నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. శనివారం నిరసనకు వెళ్లిన వందలాది మంది యువత సహా పలువురు రాజకీయ నాయకులు అరెస్టైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై గుంపు పాలన సాగించాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయని విమర్శలు గుప్పించారు.


లోక్‌సభ ఎంపీ సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలను ఖండించలేదంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను కూడా సంబిత్ పాత్ర తప్పుబట్టారు. రాహుల్‌ను ‘నలాయక్‌’ అని దుయ్యబట్టిన ఆయన.. జంతర్‌ మంతర్‌ వద్ద జరుగుతున్న పరిణామాలు, టీవీలు, సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం కావన్నారు. దేశం ప్రశాంతంగా, సుపరిపాలనతో ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. ఆందోళన పేరిట హింసను ప్రేరేపించే దిశగా ప్రయత్నాలు జరిగినా.. అవన్నీ విఫలమయ్యాయని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్‌ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత

Updated Date - Oct 10 , 2026 | 05:14 PM