Share News

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:50 PM

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ సావిత్రీ బాయి శంకర్‌ దీప్కే మహారాష్ట్రలో కన్నుమూశారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత
Abhijit Deepke Grandmother Passed away

ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు, కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ సావిత్రీ బాయి శంకర్‌ దీప్కే(80) మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తుదిశ్వాస విడిచారు.


కాగా.. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలిపేందుకు ముంబై నుంచి వచ్చిన అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్‌, ఆశుతోష్‌ రంకాలను పోలీసులు విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీప్కే నానమ్మ మృతి.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు అభిజీత్‌ బంధువొకరు తెలిపారు. నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అభిజీత్‌ కూడా స్వగ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం.


ఇవీ చదవండి:

ఢిల్లీలో ఆంక్షలపై శశి థరూర్‌ ఆగ్రహం.. ‘ఎమర్-జెన్‌జీ’ అంటూ విమర్శలు

ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్

Updated Date - Oct 10 , 2026 | 03:57 PM