ఢిల్లీలో పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది: అరవింద్ కేజ్రీవాల్
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:00 PM
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఎమెర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ చేపట్టనున్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
‘ప్రధాని మోదీ సంపూర్ణ నియంతృత్వ పాలనలో మనం జీవిస్తున్నాం. ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణంగా లేదు. ఇది ఎమర్జెన్సీని మించినది. రైళ్లను, మెట్రోలను, రోడ్డు మార్గాలను నిలిపివేశారు. కాగా.. విమానంలో సీజేపీ నేతలు వస్తే.. విమానం దిగడంతోనే వారిని అరెస్ట్ చేయడం నిజంగా భయాన్ని కలిగిస్తోంది. మోదీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ప్రధాని మోదీకి తాను దొంగ ఓట్లతోనే ఎన్నికల్లో గెలిచానని స్పష్టంగా తెలుసు.. అందుకే ఈ ఉద్యమాన్ని అణచివేసి తన మోసం బయటపడకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు