Share News

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 08:47 AM

మైట్రో టికెట్ బాక్సులో ఓ పిల్లి హాయిగా నిద్రిస్తోంది. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌
Mumbai Metro cat

ఇంటర్నెట్ డెస్క్: రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ల్.. టికెట్ల కోసం ప్రయాణికుల బారులు.. రైళ్ల రాకపోకలతో హడావుడి. ఇంతటి రద్దీ వాతావరణంలోనూ ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా కునుకు తీస్తోందో పిల్లి. అది కూడా టికెట్‌ డిస్పోజల్‌ బాక్సులో. ముంబై మెట్రోలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.


ఆ వీడియోలో మెట్రో టికెట్లు వేసే ఓ ట్రాన్స్‌పరెంట్‌ బాక్స్‌లో పిల్లి హాయిగా నిద్రిస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో ప్రయాణికులు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలించారు. కొందరు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. శ్రేయా షాజీ అనే ఇన్‌స్టా యూజర్..'ఎవరో టికెట్‌ అనుకుని పిల్లిని పడేసినట్టున్నారు!' అనే అర్థం వచ్చేలా సరాదా కామెంట్ జోడించారు. దీంతో ఈ వీడియోకు మరింత హాస్యాన్ని జోడించినట్టయింది.


వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు ఆ పిల్లిని ముంబై మెట్రోకు వచ్చిన 'కొత్త ఉద్యోగి'అని అభివర్ణించగా.. మరికొందరు 'చీఫ్‌ ఫెలైన్‌ ఆఫీసర్‌' అంటూ వింత కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం పిల్లి నిద్రపోతున్న తీరు చాలా ముద్దుగా ఉందంటున్నారు. ప్రశాంతంగా నిద్రపోవడానికి పిల్లికి ఇంతకంటే మంచి ప్రదేశం దొరకలేదేమో అన్నట్టు పలువురు నవ్వులు పూయించారు. ఏదిఏమైనా సాధారణంగా సాగిపోయే మెట్రో ప్రయాణంలో ఈ పిల్లి దృశ్యం నెటిజన్లకు కాస్త ఆహ్లాదాన్ని పంచినట్టైంది.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 26 , 2026 | 09:09 AM