Share News

మ్యాక్‌బుక్ ఇవ్వరని తెలిసి జాబ్ వదులుకున్న టెకీ!

ABN , Publish Date - Sep 23 , 2026 | 10:38 PM

నేటి జమానాలో టెకీలకు కోరిన శాలరీతో జాబ్ దొరకడమే కష్టంగా మారిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఓ టెకీ ఓ మంచి జాబ్ ఆఫర్‌ను కాదనుకున్నారు.

మ్యాక్‌బుక్ ఇవ్వరని తెలిసి జాబ్ వదులుకున్న టెకీ!
Job Offer Rejection Over Macbook

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో టెకీలకు కోరిన శాలరీతో జాబ్ దొరకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఓ టెకీ మంచి జాబ్ ఆఫర్‌ను కాదనుకున్నారు. ఆఫీసులో చేరాక తనకు మ్యాక్ బుక్ ఇవ్వరని తెలిసి జాబ్‌ను నో అన్నారు. సాధారణ ల్యాప్‌టాప్‌తో పనిచేయలేనని తెగేసి చెప్పారు. సదరు టెకీ బంధువు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేశారు. ఆ టెకీ పంపిన ఈమెయిల్‌ను కూడా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


అయేషా ఫాతిమా అనే నెటిజన్ తన బంధువు చేసిన పని గురించి చెప్పుకొచ్చారు. ఆమె షేర్ చేసిన ఈమెయిల్‌లోని వివరాల ప్రకారం, మ్యాక్ బుక్ ఇవ్వనందుకే సదరు టెకీ జాబ్ ఆఫర్‌ను వదులుకున్నారు. తన నిర్ణయం వింతగా ఉన్నప్పటికీ తప్పట్లేదని చెప్పుకొచ్చారు. పని సాధనాల విషయంలో తనకు ఓ అభిరుచి ఉందని, ఇందుకు విరుద్ధంగా చేయలేనని కూడా తేల్చి చెప్పారు. మొదట్లో సాధారణ ల్యాప్‌టాప్‌తో సర్దుకుపోయేందుకు సిద్ధంగానే ఉన్నా ఆ తరువాత కూడా మ్యాక్ బుక్ ఇవ్వరని తెలిశాకే తాను జాబ్ ఆఫర్ వదులుకునేందుకు రెడీ అయ్యానని తెలిపారు.


ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కొందరు ఆ టెకీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరికొందరు సమర్థించారు. పని చేసేందుకు అనువైన సాధనాలు లేని సమయాల్లో పని నుంచి తప్పుకుపోవడమే బెటరని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సర్‌ప్రైజ్! స్వయంగా దోశ వేసి..

వైరల్‌గా మారిన చండీగఢ్ యూనివర్సిటీ డ్యాన్స్ వీడియో.. ఎందుకింత చర్చ?

Updated Date - Sep 23 , 2026 | 10:45 PM