వైరల్‌గా మారిన చండీగఢ్ యూనివర్సిటీ డ్యాన్స్ వీడియో.. ఎందుకింత చర్చ?
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:50 PM
చండీగఢ్ యూనివర్సిటీ ఫ్రెషర్స్ ఫీస్టా-2026లో విద్యార్థుల డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చండీగఢ్ యూనివర్సిటీ ఫ్రెషర్స్ ఫీస్టా-2026లో విద్యార్థుల డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు చేసిన డ్యాన్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ప్రదర్శనపై విమర్శలు చేస్తూ.. ఇలాంటి కార్యక్రమాల్లో డ్యాన్స్ ప్రదర్శనలకు కొన్ని పరిమితులు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో భాగమేనని సమర్థిస్తున్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం.. వాటిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదు. ఇటీవల డెహ్రాడూన్‌లోని జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ‘ఊ లా లా, తు హై మేరీ ఫాంటసీ’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో కూడా విమర్శలకు దారితీసింది. తాజాగా చండీగఢ్ యూనివర్సిటీ ఫ్రెషర్స్ ఫీస్టా వీడియో కూడా అదే తరహాలో ఆన్‌లైన్ చర్చకు దారితీయడంతో.. కళాశాలల్లో విద్యార్థుల వినోద కార్యక్రమాల పరిధి.. వాటిపై సోషల్ మీడియాలో వచ్చే స్పందనలపై మరోసారి చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి..
అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మంత్రి లోకేశ్
సాయికృష్ణ కేసు.. హైకోర్టు విచారణపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Read Latest TG News And Telugu News