నారీ శక్తి వందన్ చట్టంతో మహిళలకు రాజకీయంగా కొత్త అవకాశాలు: అమిత్ షా
ABN , Publish Date - Nov 28 , 2026 | 02:57 PM
నారీ శక్తి వందన్ చట్టంతో మహిళలకు రాజకీయంగా కొత్త అవకాశాలు రానున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. నారీ శక్తికి రాజకీయాల్లో పెద్దపీట వేస్తున్నామని ఉద్ఘాటించారు.
ఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నారీ శక్తి వందన్ చట్టంతో మహిళలకు రాజకీయంగా కొత్త అవకాశాలు రానున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. నారీ శక్తికి రాజకీయాల్లో పెద్దపీట వేస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల వ్యవస్థలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని నాయకత్వంలో నిన్న కేంద్ర క్యాబినెట్ 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిందని తెలిపారు. దశాబ్దాలుగా మహిళలు ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్లు సాకారం కానున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయని వెల్లడించారు.
అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి..
నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంలో కీలక అవకాశాలు వస్తాయని అమిత్ షా వివరించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో కనీసం మూడో వంతు మహిళల ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. మహిళల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలు మరింత సమ్మిళితంగా, ప్రజలకు చేరువగా మారుతాయని చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల విధాన రూపకల్పన, చట్టాల తయారీ, జాతీయ ప్రాధాన్యతల నిర్ణయంలో కొత్త కోణం ఆవిష్కృతమవుతుందని తెలిపారు. మహిళలను పాలనలో బలమైన భాగస్వాములుగా మార్చే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News