మోదీ కేబినెట్‌లో సుప్రియా సూలేకు చోటు?
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:32 AM
జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేస్తోంది. పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ (SP) సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ముంబై, నవంబర్ 28: ముంబై, నవంబర్ 28: జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేస్తోంది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రంలోనూ, మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక పదవుల కోసం బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా (INDIA) కూటమిని వీడి ఎన్డీయే (NDA) గూటికి చేరేందుకు తెరవెనుక చర్చలు వేగవంతమయ్యాయి.
కేంద్రంలో సుప్రియా సూలే.. మహారాష్ట్రలో 4 మంత్రి పదవులు!
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే(శరద్ పవార్ కుమార్తె)కు కేంద్రంలోని నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్సీపీ పట్టుబడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . అదే సమయంలో, మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో రెండు కేబినెట్ మంత్రి పదవులు(జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ, జితేంద్ర అవ్హాద్‌కు మరో కీలక శాఖ), సీనియర్ ఎమ్మెల్యేల కోసం రాష్ట్ర ప్రభుత్వంలో రెండు సహాయ మంత్రి (MoS) పదవులను డిమాండ్ చేస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, సుప్రియా సూలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారన్న వార్తలను ఆమె స్వయంగా కొట్టిపారేశారు. తమ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని గుర్తుచేశారు.
ఇండియా కూటమి సమావేశానికి దూరం, కాంగ్రెస్‌కు పవార్ ఫోన్!
లోక్‌సభలో తమ పార్టీకి ఉన్న 8 మంది ఎంపీల మద్దతు డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయేకు అత్యంత కీలకంగా మారనుంది. పార్టీలో మరోసారి చీలిక రాకుండా నివారించాలంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం అనివార్యమని అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫోన్ చేసి తన 'నిస్సహాయతను' వివరించినట్లు సమాచారం.
నేడు (శనివారం) జరిగే ఇండియా కూటమి సమావేశానికి సుప్రియా సూలే సహా ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలెవరూ హాజరుకావడం లేదని, సోమవారం నేరుగా పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్తారని సమాచారం.(Sharad Pawar Delimitation)
కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
శరద్ పవార్ యూటర్న్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ 'ఎక్స్' (X) వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. '2026 మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ (ఎస్పీ)కి కేవలం 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ, 85 ఏళ్ల వయసులో శరద్ పవార్‌ను రాజ్యసభకు పంపేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఏమాత్రం సంకోచించకుండా మా సీటును త్యాగం చేసి మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడేంటి?' అంటూ మరాఠీలో పోస్ట్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!
కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News