Home » Delimitation bill
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వస్తున్న వార్తల్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అబద్ధం, ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సంఖ్యా బలాన్ని కూడగట్టుకుని బిల్లులను గట్టెక్కించాలని పావులు కదుపుతోంది.
దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభకు వివరించారు. ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.
బీజేపీ చేసే డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు 66 సీట్లు పెరిగితే - నార్త్ రాష్ట్రాలకు 190 సీట్లు దాటుతున్నాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. 50 శాతం ప్రకారం సీట్ల పెంపు చేస్తే భవిషత్తులో దక్షిణ రాష్ట్రాల అవసరం లేకుండా పోతుందన్నారు.