డీలిమిటేషన్‌తో నియోజకవర్గ ఓటర్ల సంఖ్యలో సమతుల్యత: అమిత్‌షా
ABN , Publish Date - Apr 17 , 2026 | 07:07 PM
డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభకు వివరించారు. ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.
న్యూఢిల్లీ: డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) లోక్‌సభకు వివరించారు. ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం అమిత్‌షా లోక్‌సభలో సమాధానమిస్తూ, నియోజకవర్గాల్లోని జనాభాలో భారీ వ్యత్యాసం కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు. ఒక చోట 39 మంది లక్షల మంది ఓటర్లుంటే, మరో చోట 60 వేల మంది ఓటర్లున్నారని, ఇలా నియోజకవర్గాల్లో జనాభా వ్యత్యాసాలున్నాయని చెప్పారు. డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఎంపీ లాడ్స్‌ను కూడా సమర్థవంతగా వినియోగించుకునే వీలుంటుందని చెప్పారు.
డీలిమిటేషన్‌తో ఎస్‌సీ, ఎస్టీ సీట్లు పెరుగుతాయి
మహిళా రిజర్వేషన్లకు విపక్షాలు వ్యతిరేకమనే విషయాన్ని కేంద్ర హోమంత్రి అమిత్‌షా తప్పుపట్టారు. వారిది మహిళా వ్యతిరేక మైండ్‌సెంట్ అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు ప్రభుత్వాన్ని నమ్మాలని అన్నారు. పార్లమెంటు సభ్యుల సంఖ్యను విస్తరించేందుకు, వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మూడు బిల్లులపై లోక్‌సభలో సమగ్రంగా చర్చ జరిగిందని, అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయని, ఇండియా కూటమి సభ్యుల్లో చాలామంది మాట్లాడారని అన్నారు.
దక్షిణాది ప్రాతినిధ్యం పెరుగుతుంది..
రాజ్యాంగ సవరణ వల్ల దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం బలహీనమవుతుందనడంలో ఎంత మాత్రం నిజం లేదని అమిత్‌షా వివరించారు. బిల్లు ఆమోదం తర్వాత దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే సభ్యులు, శాతం రెండూ పెరుగుతాయని వివరించారు. ప్రస్తుతం 543 మంది లోక్‌సభ సభ్యుల్లో దక్షిణాదిన 129 మంది ఎంపీలు ఉన్నారని, అది 195కు పెరుగుతుందని చెప్పారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యం పెరగడం వల్ల బలమైన గొంతు వినిపించే అవకాశం ఉంటుందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
ఇండి కూటమి సభ్యులు బిల్లును వ్యతిరేకించారు: అమిత్ షా
బాలాకోట్ మెజిషియన్.. మోదీపై రాహుల్ విసుర్లు, భగ్గుమన్న బీజేపీ