ఇండి కూటమి సభ్యులు బిల్లును వ్యతిరేకించారు: అమిత్ షా
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:28 PM
మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్ష 'ఇండి' (INDIA) కూటమి లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్ష 'ఇండి' (INDIA) కూటమి లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని 'ఇండి' కూటమి సభ్యులు వ్యతిరేకించడం విచారకరమని అమిత్ షా అన్నారు.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎందుకని అమిత్ షా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన మూడు బిల్లులకు మహిళా రిజర్వేషన్ల బిల్లుతో విడదీయలేని సంబంధం ఉందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియ అంతా ఒక పద్ధతి ప్రకారం సాగుతోందని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజనను (Delimitation) వ్యతిరేకించడం అంటే.. ఎస్సీ (SC), ఎస్టీ (ST) సీట్ల పెంపును వ్యతిరేకించడమేనని అమిత్ షా అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య పెరగాలంటే పునర్విభజన అనివార్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ లోక్‌సభ నియోజకవర్గాల జనాభాలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని, ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన ప్రాతినిధ్యం దక్కాలంటే పునర్విభజన అవసరమని అమిత్ షా నొక్కి చెప్పారు.
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో అమలు చేసేలా మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని అమిత్ షా ప్రకటించారు. సభలో ప్రస్తుతం 56 మంది మహిళా ఎంపీలు ఉండటం శుభపరిణామమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
ఏపీలో మోత మోగిస్తున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు