రాహుల్ ప్రసంగం పీసీ సర్కార్ మ్యాజిక్ షోలా సాగింది: నిషికాంత్ దూబె
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:30 PM
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె స్పందించారు. ఏప్రిల్ 17 గురించి రాహుల్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టడమే కాకుండా.. కులగణన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె విమర్శలు గుప్పించారు. కులగణనను కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించిందన్నారు. కులాల ఆధారంగా జనగణన దేశాన్ని విభజిస్తుందని నాడు హస్తం పార్టీ వాదించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకపోయినా కులగణన నిర్వహణ ఎప్పటికీ సాధ్యం కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇక ఏప్రిల్ 17 గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు నిషికాంత్.
'ఏప్రిల్ 17 గురించి రాహుల్ గొప్పగా చెబుతున్నారు. 1987లో బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసింది ఆ రోజేగా. అదే రోజునే సీతారామ్ కేసరి నుంచి సోనియా గాంధీ పదవి లాక్కున్నారు. 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పడగొట్టింది కూడా ఇదే తారీఖునే. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తుంటే రాహుల్ తట్టుకోలేకపోతున్నారు. రాహుల్ ప్రసంగం పీసీ సర్కార్ మ్యాజిక్ షోలా సాగింది. మహిళా బిల్లు గురించి రాహుల్ మాట్లాడలేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు' అని నిషికాంత్ దూబె అన్నారు.
ఇవీ చదవండి:
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ
ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్