ప్రెగ్నెన్సీ.. బెయిల్ కోసం దరఖాస్తు! టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసులో కొత్త ట్విస్ట్
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:52 PM
టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఉద్యోగి నిదా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె కుటుంబం పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడుల కేసుకు సంబంధించి తాజాగా కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలు నిదా ఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆమె కుటుంబం పేర్కొంది. తొలిసారి తల్లిని కాబోతున్నందున బెయిల్ కోరినట్టు సమాచారం. ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, నిదా ఖాన్ ముంబైలోనే ఉన్నట్టు ఆమె కుటుంబం చెబుతోంది. నాసిక్ బీపీఓ యూనిట్‌లో 2021లో ఆమె చేరారు.
నాసిక్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలతో దాఖలైన తొమ్మిది కేసులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఆర్ విభాగం అధికారిణితో పాటు మరో ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ కేసు కోసం పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్ సహోద్యోగులు లైంగిక వేధింపులకు దిగారని ఈ కేసులో బాధితులు ఆరోపించారు. హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళా రిజర్వేషన్‌పై నోటిఫికేషన్.. లోక్‌సభలో చర్చ జరుగుతుండగానే..
పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..