Share News

ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:23 PM

లోక్‌సభలో జరుగుతున్న చర్చపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మహిళా బిల్లు కాదని, 2023లోనే బిల్లును పార్లమెంటులో ఆమోదించారని అన్నారు. ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు.

ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్
Rahul gandhi

న్యూఢిల్లీ: ఇది మహిళా బిల్లు కాదని, 2023లోనే బిల్లును పార్లమెంటులో ఆమోదించడం జరిగిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగం కంటే మనువాదం అమలుకు ప్రయత్నిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటిషన్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్ గాంధీ శుక్రవారంనాడు పాల్గొంటూ, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం కొల్లకొడుతున్నారని, అధికారంలో దళిత హిందువులకు షేర్ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం వారి హక్కులను లాక్కునేందుకు తాము అనుమతించమని అన్నారు. ఓబీసీలను దూరంగా ఉంచి, వారి హక్కులను కొల్లగొట్టేందుకే కులగణను బైపాస్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని తప్పుపట్టారు.


మహిళా బిల్లు ముసుగులో ఎలక్టోరల్ మ్యాప్‌ను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. సమాజంలో దళితులు, ఓబీసీలు, వారి మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలుసునని అన్నారు.


తల్లులుగా, చెల్లెళ్లుగా సమాజంలో మహిళలది కీలక పాత్ర అని రాహుల్‌ కొనియాడారు. తన నానమ్మ ఇందిర వల్లే ధైర్యం, ఆత్మవిశ్వాసం తనలో పెరిగాయని, నిజం గురించి మాట్లాడేందుకు తాను ఎప్పుడూ భయపడనని చెప్పారు. తన సోదరి ప్రియాంక గాంధీ సహా సభలో చాలా మంది మహిళల గురించి గొప్పగా మాట్లాడారని అన్నారు. మహిళలకు దేశ ఛోదక శక్తి అని ప్రధాని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. తమ ఇద్దరికీ ఎలాంటి 'వైఫ్ ఇష్యూస్' లేవని చమత్కరించారు.



ఇవి కూడా చదవండి..

మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లు.. మరికొద్దిసేపట్లో ఓటింగ్..

Updated Date - Apr 17 , 2026 | 04:07 PM