Share News

మహిళా రిజర్వేషన్ బిల్లు.. మరికొద్దిసేపట్లో ఓటింగ్..

ABN , Publish Date - Apr 17 , 2026 | 01:51 PM

లోక్ సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులపై మరికొద్ది సేపట్లో లోక్‌ సభలో ఓటింగ్ జరగనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు.. మరికొద్దిసేపట్లో ఓటింగ్..
Women’s Reservation Bill

ఢిల్లీ: లోక్ సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులపై మరికొద్ది సేపట్లో లోక్‌ సభలో ఓటింగ్ జరగనుంది. మెజారిటీ మార్కుపై అధికారపక్షంలో ఓ వైపు టెన్షన్ కొనసాగుతున్నా.. ఎంపీలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందడం ఎన్డీయేకి అగ్నిపరీక్షగా మారింది.


రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు సుమారు 362 ఓట్లు మెజారిటీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బిల్లుల ఆమోదం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్‌పై ఎన్డీయే మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. సొంత బలం 293 మాత్రమే ఉన్నప్పటికీ, తటస్థ పార్టీల మద్దతుతో మేజిక్ ఫిగర్ దాటుతామని ఎన్డీయే ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు డీలిమిటేషన్ క్లాజ్‌ను తొలగించకపోతే బిల్లులను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి స్పష్టం చేసింది. అయితే, బిల్లులు నెగ్గించుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.


విపక్షాల నుంచి కొంతమంది సభ్యులను ఓటింగ్‌కు దూరంగా ఉంచడం ద్వారా అవసరమైన మెజారిటీ శాతాన్ని తగ్గించే ప్రయత్నాల్లో అధికార పక్షం ఉన్నట్లు సమాచారం. కీలక ఓటింగ్ నేపథ్యంలో తమతమ పార్టీల ఎంపీలంతా సభకు హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే త్రీ-లైన్ విప్ జారీ చేశాయి. మహిళా ఓటర్ల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, విపక్షాలు చివరి నిమిషంలో బిల్లుకు మద్దతు ఇస్తాయా? లేక వ్యతిరేక ఓటు వేస్తాయా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..

హీరో దర్శన్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ ప్రత్యక్షం

Updated Date - Apr 17 , 2026 | 01:57 PM